‘ముద్దిన మావ’ అనే సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాత్రకు డాక్టర్ రాజ్‌కుమార్ పాటలు పాడటం మరో విశేషం. తెలుగులో దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన ‘మామగారు’ సినిమాను కన్నడలో ‘ముద్దిన మావ’గా రీమేక్ చేశారు. తెలుగులో దాసరి పోషించిన పాత్రను కన్నడలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేశారు. అంతేకాదు, ఈ సినిమాకు ఎస్పీబీ సంగీతం సమకూర్చారు.