అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్లు తెరచుకోవడానికి పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించారు. 50శాతం సీట్లతో భౌతిక దూరం, మాస్క్ ధరించడం లాంటి నిబంధనలను జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్లను తెరచుకోవచ్చని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు.