క్యాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేసిన నటీమణులకు చిన్న చురక అంటించింది సీరత్ కపూర్. క్యాస్టింగ్ కౌచ్ పై గోలచేయం వల్ల ఉపయోగం లేదని, దాని బారిన పడకుండా ఎలా తప్పించుకోవాలో ఇతరులకు చెబితే బాగుంటుందని వివరించింది ఈ ముద్దుగుమ్మ. ఆరోపణలతో సమయం వృథా చేసుకోకుండా.. క్యాస్టింగ్ కౌచ్ నుంచి మనల్ని మనం కాపాడుకొని, మరింత స్ట్రాంగ్ గా మారడమే అత్యుత్తమ మార్గం అంటోంది సీరత్.