నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్లకోసం మొదలైన వేట ఇంకా ఓ కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఇందులో యంగ్ బాలయ్యకు జంటగా బాలీవుడ్ ముద్దుగుమ్మను రంగంలోకి దించేందుకు దర్శకుడు బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలయ్య ఈ సినిమాలో రెండు విభిన్నమైన గెటప్ లలో కనిపించబోతున్నాడు. ఈ రెండు పాత్రల్లో సీనియర్ బాలయ్య సరసన జయప్రద నటించబోతున్నట్టు తెలుస్తోంది.