'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలై 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రాన్ని తలచుకున్నారు నటి నదియా.''ప్రముఖ దర్శకుడు, స్కిప్ట్ రైటర్ త్రివిక్రమ్‌గారు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు గర్వంగా ఫీలవుతున్నాను. అద్భుతమైన నటులు ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులతో పనిచేసే అవకాశం లభించినందుకు గౌరవంగా భావిస్తున్నాను.." అని నదియా తన ట్వీట్లో పేర్కొన్నారు.