ప్రస్తుతం పూజా హెగ్డే ప్రభాస్ సరసన రాదే శ్యామ్ సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన విషయం ఒకటి ప్రస్తుతం మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పూజా హెగ్డే కవల అమ్మాయిలుగా కనిపించబోతుందట. కథకు ఆమె చాలా కీలకంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.