బాలు గారు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న తరవాతే తనికెళ్ల భరణి దర్శకత్వం వహించిన ‘మిథునం’లో బాలు యాక్ట్ చేశారు. వావిలవలసలో ఆ సినిమా షూటింగ్ జరిగింది. ఆ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులూ మధ్యాహ్నం బ్రేక్ టైమ్ లో తోటలో బెండకాయ కోసుకుని, పచ్చిది తిన్నారని భరణి చెప్పారు. ‘ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి పచ్చివి తింటూ ఉండాలయ్యా’ అని చుట్టుపక్కల వాళ్ళతో బాలు చెబుతూ ఉండేవారట.