లక్ష్మీ మీనన్ కూడా బిగ్ బాస్ సీజన్ 4లో పార్టిసిపేట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీ మీనన్ పుకార్లకు వివరణ ఇచ్చారు. బిగ్ బాస్ ఒక చెత్త రియాలిటీ షో, ఒకరు తిన్న ప్లేట్లు మరొకరు కడగాలి, ఒకరు వాడిన టాయిలెట్స్ మరొకరు శుభ్రం చేయాలి. కెమెరా ముందు ఇంటి సభ్యులతో వివాదాలకు దిగాలి. అలాంటి పనులు నేను చేయలేను బిగ్ బాస్ షో పై నా అభిప్రాయం నేరుగా చెప్పాను. ఇకపై నేను బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నాననే పుకార్లు రావని ఆశిస్తున్నా అన్నారు. లక్ష్మీ మీనన్ వ్యాఖ్యలకు కొందరు నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఆమె వ్యాఖ్యలు కొందరి మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.