రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ లేట్ అవుతుండటంతో.. ఆయన కొత్త సినిమాపై ఫిలింనగర్ సర్కిళ్లలో చాలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ ప్రచారానికి రామ్ చరణ్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. ప్రస్తుతానికి తన దృష్టి అంతా ఆర్ఆర్ఆర్ పైనే ఉందని, ఆ తర్వాత కొత్త సినిమా ఏదీ తాను ఫైనల్ చేయలేదని చెప్పేశారు. తన సోషల్ మీడియా టీమ్ ద్వారా ఈ పుకార్లకు చెక్ పెట్టారు చరణ్.