అల్లుడు అదుర్స్ సినిమాలో సోనూ సూద్ క్యారెక్టర్ మరీ క్రూరంగా ఉంటుందని సమాచారం. శాడిస్ట్ విలన్ గా ఈ సినిమాలో ఆయన పాత్ర డిజైన్ చేశారు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. కరోనా తర్వాత సోనూ సూద్ ఇమేజ్ మారిపోవడంతో ఆయన పాత్రలో కూడా మార్పులు చేర్పులు చేశారట. దాదాపు టాకీ పార్ట్ పూర్తి అయినా కూడా.. సోనూ సూద్ కోసం కొన్ని సన్నివేశాలను అదనంగా చేర్చారట. అందులో సోనూ సూద్ పూర్తిగా మారిపోయినట్టు, చివర్లో పశ్చాత్తాప పడి మంచివాడిగా మారిపోయేలా చేశారట.