త్రివిక్రమ్ మిత్రుడు పవన్ కళ్యాణ్ తో కోబలి అనే ఓ భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేశారు. చాలా కాలం క్రితం ఈ మూవీ ప్రకటన కూడా జరిగి మధ్యలో ఆగిపోయింది. సోషియో ఫాంటసీ కథతో ఓ భిన్నమైన సబ్జెక్టుతో త్రివిక్రమ్ ఆ చిత్రం తెరకెక్కించాలని అనుకున్నారు. ఈ మధ్య త్రివిక్రమ్, పవన్ ఆ మూవీ పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. బండ్ల గణేష్ పవన్ తో చేయనున్న ప్రాజెక్ట్ ఇదే కావచ్చనే ఊహాగానాలు మొదలైపోయాయి.