చంద్రశేఖర్ యేలేటి తో నితిన్ ఓ సినిమా ని మొదలుపెట్టాడు..రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాష్ వారియర్ అందులో హీరోయిన్లు. అంధాదూన్ కంటే ముందు ఆ సినిమా పూర్తి చేయాలనే నితిన్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ లాక్డౌన్లో ఏమయిందో ఏమో నితిన్ కానీ, అతని పీఆర్ టీమ్ కానీ ఏలేటి సినిమా గురించి అస్సలు మాట్లాడ్డం లేదు. ఆ సినిమాను ఆపేసారా లేక తర్వాత చేస్తారా అనేదానిపై కూడా ఇన్ఫర్మేషన్ లేదు.