"ఈ లాక్ డౌన్ టైమ్ లో చాలా సినిమాలు చూశాను. చాలా స్క్రిప్టులు కూడా చదివాను. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అంతేకాదు.. వాటిలోంచి రెండు ప్రాజెక్టులకు సైన్ కూడా చేశాను. వాటి చిత్రీకరణలో పాల్గొనడానికి చాలా ఉత్సుకతతో ఉన్నాను." ఇలా తన సినిమాల లైనప్ బయటపెట్టింది అనుష్క. అంతేకాదు.. వచ్చే ఏడాది జనవరి నుంచి 2 కొత్త సినిమాలతో బిజీ అవ్వబోతున్నానని, మరే ఇతర ప్లాన్స్ లేవని పరోక్షంగా తన పెళ్లి టాపిక్ ను కొట్టేసింది.