విజయ్ కాంత్ కు కరోనా పాజిటివ్ వచ్చినా.. ఆయనకు ఎలాంటి లక్షణాల్లేవు. కేవలం ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అసింప్టమాటిక్ కేసు కావడంతో ఆయనను పూర్తిగా అబ్జర్వేషన్ లో ఉంచారు వైద్యులు. మరో 5 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని కూడా ప్రకటించారు. విజయ్ కాంత్ పై వస్తున్న ఎలాంటి పుకార్లు నమ్మొద్దని కోరుతున్నారు.