లాక్ డౌన్ తర్వాత ధైర్యంగా విదేశాలకు వెళ్లిన తొలి భారత హీరోగా అక్షయ్ కుమార్ రికార్డ్ సృష్టిస్తే, తొలి తెలుగు హీరోగా మహేష్ బాబు వార్తల్లోకెక్కుతున్నారు. సర్కారువారి పాటకోసం నవంబర్ 1నుంచి ఆయన విదేశాలకు వెళ్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ మేరకు వీసా ప్రాసెస్ జరుగుతోంది. మరోవైపు దర్శకుడు పరశురామ్ తన సినిమాకు సంబంధించి లొకేషన్లు ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.