ఒక సినిమా హిట్ అని తెలియాలి అంటే అది ఎన్నిరోజులు ఆడిందా అని కాదు ఎంత వసూళ్లు రాబట్టయ్యిందా అని అర్ధం. ఇక కలెక్షన్లు రెండు రకాలు అవి ఒకటి గ్రాస్ కలెక్షన్స్.. ఇంకొకటి షేర్ కలెక్షన్స్.. గ్రాస్ కలెక్షన్స్ అంటే థియేటర్లకు సంబంధించిన రెంట్లు చెల్లించాల్సిన ఎమౌంట్ కాకుండా .. మొత్తం సినిమాకు సంబంధించిన టికెట్లు అమ్మగా వచ్చిన ఎమౌంట్ ను గ్రాస్ కలెక్షన్స్ అంటారు. ఇక షేర్ అంటే.. వచ్చిన మొత్తం గ్రాస్ కలెక్షన్స్ నుండీ థియేటర్ రెంట్ లు అలాగే జి.ఎస్.టి లు వంటి టాక్స్ లు పోగా మిగిలినది అన మాట. ఈ షేర్ కలెక్షన్స్ ను బట్టే.. సినిమాకు పెట్టిన బడ్జెట్ మరియు లాభాలను ప్రత్యేకపరిచి.. సినిమా హిట్టా..ఫ్లాపా అన్నది డిసైడ్ చేస్తుంటారు ట్రేడ్ పండితులు.