ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో ఈ నెల 14న సామూహిక అత్యాచారానికి గురైన యువతి సోమవారం మరణించింది. హత్యాచార కాండకు పాల్పడిన నలుగురు దోషులను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ ఘటనను రిపోర్ట్ చేసే విషయంలో స్టయిల్ చేంజ్ చేయాలని ఝాన్సీ డిమాండ్ చేస్తున్నారు. “మహిళలపై లైంగిక దాడి, వేధింపులకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసేటప్పుడు బాధితులను కాకుండా దోషులను హైలైట్ చెయ్యండి.వార్తను ప్రజల ముందుకు తీసుకొచ్చే విధానాన్ని మార్చండి” అని ఝాన్సీ పేర్కొన్నారు.