మెగా ఫ్యామిలీ హీరో పరిచయం అయ్యే సినిమాని ఓటీటీలో విడుదల చేయడం సరికాదని, చిరంజీవి ఉప్పెన ఓటీటీకి వెళ్లకుండా అడ్డుకున్నారట. నష్టం వచ్చినా పర్వాలేదు నేరుగా థియేటర్లలోనే సినిమా విడుదలయ్యేలా చూడాలని చెప్పారట చిరంజీవి. దీంతో దర్శక నిర్మాతలు కాస్త వెనక్కి తగ్గారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించడంతో అక్టోబర్ 15నుంచి థియేటర్లు తెరుచుకుంటున్నాయి. చిరంజీవి అడ్డు తగలకపోయి ఉంటే ఉప్పెన ఓటీటీలో వచ్చిఉండేది. చిరు థియేటర్ రిలీజ్ కి పట్టుబట్టడం వల్లే వైష్ణవత్ తేజ్ గ్రాండ్ ఎంట్రీ సాధ్యమవుతోంది.