టాలీవుడ్లో ఓ సెంటిమెంట్ ఉంది… ‘దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకి అయినా.. తరువాత సినిమా డిజాస్టర్ ఫలితం ఇస్తుంది అని’..! ఇది చాలా వరకూ ప్రూవ్ అవుతూ వచ్చింది. ఆఖరికి నాని, సునీల్ వంటి హీరోలు కూడా ఆ సెంటిమెంట్ నుండీ తప్పించుకోలేకపోయారు. ఒక్క రాజమౌళితో అనే కాదు.. ఓ పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరో చేసే తరువాతి సినిమా పై భారీ అంచనాలు నెలకొంటాయి. ఆ అంచనాలను అందుకోలేక.. వారి తరువాతి సినిమాలు ప్లాప్ అవుతూ ఉంటాయి.