చెక్ అనే టైటిల్ తో రానున్న నితిన్  మూవీ ప్రీ లుక్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. నితిన్ చేతికి బేడీలు ఉండగా, కుడి చేతి వేళ్ళకు నకుల్ వెపన్ ధరించిన ఆనవాళ్లు వున్నాయి. ఇక చెస్ బోర్డు, దానిపై చిందరవందరగా ఉన్న పావులు ఉన్నాయి. విభిన్నంగా ప్రీ లుక్ ఆసక్తి రేపుతుండగా, నితిన్ గ్యాంగ్ స్టర్ లేదా, రౌడీ ఫెలో అయ్యే అవకాశం కలదు. ఇక టైటిల్ ని బట్టి చూస్తే మూవీ స్క్రీన్ ప్లే ప్రధానంగా, సూపర్ మైండ్ గేమ్ తో నడిచే అవకాశం కలదు.