జయం రవి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ‘బోగన్’ చిత్రం అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. హన్సిక కథానాయిక. లక్ష్మణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాత రామ్ తాళ్లూరి తెలుగులో అనువదిస్తున్నారు. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘బ్యాంకు దొంగతనం కేసు దర్యాప్తు నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ ఇది. విక్రమ్ ఐపీఎస్‌గా జయం రవి, దొంగ ఆదిత్యగా అరవింద్ స్వామి కనిపిస్తారు. ‘‘అనువాద కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తాం’’అని నిర్మాత చెప్పారు.