నిశ్శబ్దం సినిమాని ఓటీటీకి ఇచ్చి మంచి పని చేశారని, థియేటర్లలో అయితే ఈ సైలెంట్ కిల్లర్ ని ప్రజలు భరించలేరని అంటున్నారు నెటిజన్లు. నిశ్శబ్దంపై వస్తున్న నెగెటివ్ రివ్యూలతో ఈ సినిమా ఓటీటీకి వచ్చి మంచి పనిచేసిందని, నిర్మాతలు సేవ్ అయ్యారని అంటున్నారు. గతంలో కీర్తి సురేష్ పెంగ్విన్ సినిమా టైమ్ లో కూడా ఇలాగే జరిగింది. ఆ టైమ్ లో నిర్మాతలు థియేటర్లకోసం వేచి చూడకుండా.. ఓటీటీలో విడుదల చేయబట్టి సేవ్ అయ్యారని అనుకున్నారంతా..