చెక్ సినిమా ఫస్ట్ లుక్ లో నితిన్ ని చూస్తే.. మరోసారి పాత రోజులు గుర్తుకు రాక మానవు. చేతిపై టాటూతో రఫ్ లుక్ లో కనిపిస్తున్న నితిన్.. మళ్లీ యాక్షన్ జోనర్ లోకి వెళ్లి ఇబ్బంది పడతాడేమోనని అంటున్నారు. అయితే చెక్ రిజల్ట్ ని బట్టి, భవిష్యత్ లో ఇలాంటి కథలతో నితిన్ ప్రయోగాలు చేయాలా వద్దా అనేది ఆలోచించుకునే అవకాశముంది. ఒకవేళ చెక్ పూర్తిగా చెక్కేస్తే.. ఇకపై యాక్షన్ జోనర్ వైపు వెళ్లకుండా సింపుల్ లవ్ స్టోరీలు చేసుకోవడమే నితిన్ కు బెటర్.