సోనూ సూద్ హీరోగా తెలుగులో సినిమా వస్తోందని, దాన్ని ఓ స్టార్ ప్రొడ్యూసర్ తెరకెక్కిస్తున్నారని ఇటీవల వార్తలొచ్చాయి. సోనూ సూద్ కాల్షీట్లకోసం ఆ నిర్మాత ట్రై చేసిన మాట వాస్తవమే కానీ.. సోనూ సూద్ హీరోగా ఆయనకు కాల్షీట్లు ఇంకా ఇవ్వలేదని తెలుస్తోంది. అసలు తాను హీరోగా ఇంకా సినిమా ఒప్పుకోలేదని, ఎవ్వరికీ కాల్షీట్లివ్వలేదని క్లారిటీ ఇచ్చారు సోనూ సూద్.