కాజల్ అగర్వాల్ కూడా వెబ్‌సిరీస్‌లో నటించేందుకు ఆసక్తి చూపినట్టు సమాచారం. అది కూడా హాట్ క్యారెక్టర్లో నటించనుంది. వివరాల్లోకి వెళితే.. ఆ మధ్య బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్లో ఏబీసీ ఛానల్‌తో కలిసి 'క్వాంటికో' అనే టీవీ సీరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. మూడు సీజన్స్ వరకు ప్రసారం అయినా.. ఆ టీవీ షోలో ఆమె హాట్ హాట్ గా కనిపించి సంచలనం సృష్టించింది. అలాగే ఆ షోలో ప్రియాంక తన పెర్ఫార్మెన్స్తో మంచి ప్రశంసలు అందుకుంది. అయితే ఆ టీవీ షోను కాజల్‌తో ఇండియన్ వెర్షన్‌ను నిర్మించడానికి నెట్ ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోంది.