పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లైన జుహీ ఆ ఇంటర్వ్యూలో తన సినిమాల పట్ల తన పిల్లల ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పుకొచ్చింది.తన పిల్లలు జాహ్నవి, అర్జున్ తాను నటించిన సినిమాలు చూడడానికి ఇబ్బందిపడతారని చెబుతూ ఓపెన్ అయింది జుహీ చావ్లా. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో తాను చేసిన సినిమాలు చూడటానికి వాళ్లు ఇష్టపడరని, వాటిలో తాను నటించిన రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కాబట్టి ఆ సినిమాలను చూడరని చెప్పింది. ఒకవేళ ఏదైనా సినిమా చూడాలనుకున్నా.. ముందుగానే `అమ్మా ఆ మూవీలో ఏమైనా రొమాంటిక్ సీన్లు ఉంటాయా` అని అడుగుతారని చెప్పింది. అమ్మా నిన్ను రొమాంటిక్ సీన్లలో చూడడం నాకు నచ్చదని కొడుకు అర్జున్ అంటుంటాడని జుహీ చావ్లా తెలపడం విశేషం.