విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ఫాలోయింగ్ లో సౌత్ ఇండియా రికార్డు కొట్టాడు. టాలీవుడ్ టాప్ స్టార్స్ ని కాదని సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ రికార్డు అందుకున్నారు. అత్యంత ఆదరణ కలిగిన సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో ఒకటైన ఇంస్టాగ్రామ్ లో విజయ్ ఫాల్లోవర్స్ సంఖ్య 9 మిలియన్స్ కి చేరింది. అంటే 90 లక్షల మంది విజయ్ ని ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారన్న మాట. సౌత్ ఇండియాలో ఏ హీరోకి కూడా 9 మిలియన్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ లేరు.