ముగ్గురు స్టార్ రైటర్స్ రాసిన కథలు బాలయ్య కోసం సిద్ధంగా ఉన్నాయట. టాలీవుడ్ సీనియర్ రైటర్స్ ద్వయం పరుచూరి బ్రదర్స్ బాలయ్య కోసం ఓ కథ రాశారట. ఓ పవర్ సబ్జెట్ తో సిద్దమైన ఆ కథ బాలయ్యకు బాగా నచ్చేసిందట. అలాగే టాలీవుడ్ లో ఫార్మ్ లో కొనసాగుతున్న రచయిత సాయి మాధవ్ బుర్రా కూడా బాలయ్య కోసం ఓ కథ రాశారట. అలాగే మరో స్టార్ రైటర్ కోనా వెంకట్ సైతం బాలయ్య కోసం కథ సిద్ధం చేశారట. భవిష్యత్తులో బాలయ్య చేసే చిత్రాలు ఈ ముగ్గురు రచయితల కథలతో ఉంటాయని టాలీవుడ్ టాక్.