తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు అందరూ రెండు మూడు రోజుల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. థియేటర్లు ఓపెన్ చేస్తే ప్రేక్షకులు వస్తారనేది వాళ్ళ ఆశ. కరోనా నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందులో చర్చించనున్నారు. మాస్కులు లేకుండా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఉచితంగా మాస్కులు అందించడానికి ఎగ్జిబిటర్లు సూత్రప్రాయంగా సిద్ధమయ్యారు.