15 నుంచి సినిమా హాల్లు తెలుసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ప్రేక్షకుల సంఖ్యను 50 శాతానికి కుదించింది. ఉదాహరణకు 300 సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్లలో 150 మందిని మాత్రమే అనుమతించాలి అన్నమాట. ఇక్కడ మరో మెలిక కూడా ఉంది. థియేటర్లలో ప్రేక్షకుల గరిష్ట పరిమితి రెండు వందల మందికి మించరాదని పేర్కొంది. దీని వల్ల నాలుగు వందలు లేదా అంతకంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్లలో 200 మందిని మాత్రమే అనుమతించాలి. కువైట్ నిబంధనలను పాటించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇండియన్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఒక లేఖ విడుదల చేసింది.