లాక్ డౌన్ ఆచార్య సినిమాకి మరో కష్టాన్ని తెచ్చిపెట్టింది. లాక్ డౌన్ టైమ్ లో చిరంజీవి ఆచార్య రషెస్ చూశారట. కొన్ని సన్నివేశాల్ని పూర్తిగా మార్చాలని, మరికొన్ని చోట్ల కూడా చిన్న చిన్న మార్పులు చేయాలని దర్శకుడు కొరటాల శివను కోరారట. అయితే దర్శకుడు మాత్రం తాను మార్పులు చేయబోనని, అలా ఉంటేనే ఆ సన్నివేశాలు పండుతాయని స్పష్టం చేశాడట. దీంతో దర్శకుడు కొరటాల శివపై చిరు అసంతృప్తితో ఉన్నారని ఫిలిం నగర్ వర్గాల టాక్.