మగధీర చిత్రంలోని ఓ సన్నివేశాన్ని ఓ ప్రొఫెసర్ తన పాఠం కోసం వాడేశాడు. ఓ సాఫ్ట్ వేర్ పనిచేసే విధానం స్టూడెంట్స్ కి అర్థం అయ్యేలా చెప్పడానికి ఏకంగా వీడియో వేసి వివరించారు. మగధీర మూవీలో చరణ్ ని కాజల్ ఓ సంధర్భంలో అపార్థం చేసుకుంటుంది. అదే సమయంలో విలన్స్ ఆమెను హెలికాప్టర్ లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కాజల్ ని కాపాడడం కోసం రౌడీలను తప్పించుకుంటూ గాల్లో ఉన్న హెలికాప్టర్ పైకి జంప్ చేస్తాడు రామ్ చరణ్. ఈ సన్నివేశంలో చరణ్ ని ఓ ఎస్ అని (ఆపరేటింగ్ సిస్టమ్) ఆయన వెతుకున్న కాజల్ మెయిన్ మెథడ్ అని, అడ్డుకుంటున్న వాళ్ళు జావా అని చెప్పాడు. ఎంత మంది అడ్డుకున్నా చరణ్, కాజల్ చేతిని తాకి గతజన్మ జ్ఞాపకాలు గుర్తు చేస్తాడు. ఈ సందర్భాని ఎంతో పవర్ ఫుల్ సాఫ్ట్ వేర్ అయినా ఓ ఎస్ మెయిన్ మెథడ్ కి చెప్పాల్సిన సందేశం చెప్పేసిందని సదరు ప్రొఫెసర్ వర్ణించాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.