కరోనా వైరస్ లాక్డౌన్ కారణంతో ‘ఉప్పెన’ సినిమా విడుదల ఆగిపోయినప్పటికీ కీర్తి శెట్టికి మాత్రం అవకాశాలు తలుపు తడుతున్నాయి. తమ సినిమాల్లో నటించాలంటూ దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వచ్చిన అన్ని ఛాన్స్లకు ఓకే చెప్పేయకుండా కీర్తి శెట్టి జాగ్రత్తలు తీసుకుంటోందట. ఈ కోవలోనే ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్, నాని కాంబినేషన్లో తెరకెక్కబోయే ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందట.