డ్రగ్స్ కుంభకోణం కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. ఎప్పడు ఎవరి పేరు బయటికి వస్తుందోనని శాండల్‌వుడ్ సెలబ్రెటీలు వణికిపోతున్నారు. ఇప్పటికే హీరోయిన్లు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదితో పాటు పలువురిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరికొందరిని విచారించేందుకు నోటీసులు కూడా పంపారు. ఈ క్రమంలోనే ప్రముఖ యాంకర్ అనుశ్రీ పేరు కూడా బయటికి వచ్చింది.