తెలుగు సినీ ఇండస్ట్రీలో పాతుకుపోడానికి ఈషా రెబ్బా సిన్సియర్ గా ట్రైచేస్తోంది. అయితే ఆమెకు ఇంకా చెప్పుకోదగ్గ బ్రేక్ మాత్రం రాలేదు. అదే టైమ్ లో సోషల్ మీడియాలో మాత్రం ఈషా మంచి ఫేమస్. ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువే. ఫ్యాన్స్ పేరుతో ఉన్న సోషల్ మీడియా అకౌంట్లు కూడా బాగా ఎక్కువే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను బైటపెడుతుంది ఈషా. అలా ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తన ఫస్ట్ కిస్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పుకొచ్చింది.