మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్.. టాలీవుడ్ చూడముచ్చటి జంట. అయితే ఈ జంట.. పెళ్లి పీటలు ఎక్కడానికి బీజం పడింది మాత్రం వంశీ అనే సినిమాతో. ఆ సినిమా రిలీజై నేటికి 20ఏళ్లు. సరిగ్గా అక్టోబర్ -4, 2000 సంవత్సరంలో మహేష్, నమ్రత జంటగా నటించిన వంశీ సినిమా విడుదలైంది. అందుకే అక్టోబర్ 4 అంటే ఈ జంటకు అంత ప్రత్యేకత. వంశీ సినిమా షూటింగ్ లో మొగ్గ తొడిగిన తమ ప్రేమకు గుర్తుగా వంశీ సినిమా రిలీజ్ రోజును మహేష్, నమ్రత సెలబ్రేట్ చేసుకుంటారు.