మనసులో ఏం బాధగా ఉందేమో సుజాత ఓ మూలకు కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఇంతలో ఓ కెమెరా ఆమె వైపు తిరిగింది. దీంతో సుజాత కెమెరాను చూస్తూ ‘కన్నీళ్లు పెట్టుకుంటే చాలు సర్రున ఇటు తిరిగిపోతావేం’ అంటూ మాట్లాడింది. దీనిని చూసిన కుమార్ సాయి ‘ఇలాంటి ఆటలు నాకు నచ్చవు. కెమెరాలతో మాట్లాడేసి, జనాలను పార్టిసిపెంట్లు చేయకూడదు’ అంటూ కౌంటర్ వేశాడు. జనాలను ఇలా కంటెస్టెంట్లలా చేయడం బాగోదు అంటూ తన అభిప్రాయం చెప్పాడు. తనను నామినేట్ చేసిందని కుమార్ అలా అన్నాడా? లేక అనిపించి అన్నాడో మరి.