ప్రభాస్ సినిమాలపై రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు ప్రకటిస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏమిటని అడుగగా, అలాంటి చిత్రాలు చేయడం మినహా ప్రభాస్ కి వేరే దారి లేదు, అతడు లాకైపోయాడు అన్నాడు. దేశవ్యాప్తంగా అభిమానులున్న ప్రభాస్ కొందరికి మాత్రమే నచ్చే సినిమాలు, కథలు ఎంచుకోవడం కుదరదు అన్నారు.