టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ మీద కాన్సంట్రేట్ చేశారు. అదే రూటులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు, హీరో విష్ణు మంచు ట్రావెలింగ్ స్టార్ట్ చేశారు. అతడి టార్గెట్ కూడా పాన్ ఇండియా మార్కెట్. విష్ణు కి చాలా కాలంగా మంచి హిట్ సినిమా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పటికి మంచి హిట్ కోసం నానా పాట్లు పడుతున్నాడు. ఇక పోతే ప్రస్తుతం విష్ణు మంచు హీరోగా యాక్ట్ చేస్తూ, ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ‘మోసగాళ్లు’. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కూడా నటిస్తుంది. దీన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ లాంగ్వేజెస్ లో రిలీజ్ చెయ్యనున్నట్టు అతడు తెలిపాడు.