తాజాగా నటి అనుష్క ట్విట్టర్లో జాయిన్ అయింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. తన జీవితంలో ఎప్పుడూ పశ్చాత్తాప పడిన సందర్భం లేదని, అంతా కోరుకున్న విధంగానే జరిగిందని..కెరీర్లో ఈ స్థాయికి రావడం గొప్పవరంగా భావిస్తున్నానని తెలిపింది.తన కెరీర్లో సూపర్, అరుంధతి, వేదం, రుద్రమదేవి, భాగమతి, సైజ్‌జీరో, బాహుబలి, నిశ్శబ్దం చిత్రాలు వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చాయని పేర్కొంది.