ప్రపంచంలోనే అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న నటిగా సోఫియా వెర్గారా అగ్ర స్థానంలో నిలిచింది. ఏడాది కాలంలో 43 మిలియన్ డాలర్లు సంపాదించి ఈ ఘతన సొంతం చేసుకుంది సోఫియా. అంటే మన కరెన్సీలో రూ.315 కోట్లు అన్నమాట. సెలవు రోజులు తీసేస్తే.. సగటున రోజుకి ఆమె సంపాదన కోటి రూపాయల పైమాటే. ఇటీవల కాలంలో ఈ రేంజ్ లో సంపాదించిన హీరోయిన్ ఇంకెవరూ లేకపోవడం ఆశ్చర్యం.