చిరంజీవి చేస్తున్న తమిళ రీమేక్ వేదాళంలో చిరు చెల్లెలి పాత్రలో సాయి పల్లవి నటిస్తుందని ఇటీవల వార్తలొచ్చాయి. తాజాగా సాయి పల్లవి ఆ సినిమాని ఫైనల్ చేసిందని సమాచారం. అయితే ఆ ఆఫర్ సినిమా యూనిట్ నుంచి కాకుండా.. వరుణ్ తేజ్ సైడ్ నుంచి వెళ్లిందట. వరుణ్ తేజ్, సాయి పల్లవిని ఆ సినిమాకోసం రికమెండ్ చేశాడట. అందుకే మెగాస్టార్ వెంటనే ఓకే చెప్పారని తెలుస్తోంది.