జెండర్ ఈక్వాలిటీ అంటూ బిగ్‌బాస్ ఆదివారం ఓ గేమ్ పెట్టాడు. మగాళ్లు అందరూ ఆడాళ్లలాగా, అమ్మాయిలందరూ.. అబ్బాయిల్లాగా మారి డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ఈ క్రమంలో అవని (అవినాష్), హరి (హారిక) కలసి ‘ఖుషి’ సినిమాలో నడుము సీన్ చేశారు. భూమికలా అవినాష్ కనిపిస్తే, పవన్ కళ్యాణ్‌లా రౌడీ బేబీ నటించింది. పవన్ లాగా హారిక చూపించిన యాటిట్యూడ్, ఎక్స్ప్రెషన్స్కు ఇంట్లోవాళ్లే కాదు, బయట నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు.