క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ .. హీరో విజయ్ దేవరకొండల కలయికలో ఒక క్రేజీ పాన్-ఇండియన్ చిత్రం ప్రకటించడం సంచలనమే అయ్యింది. దీనిపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ చిత్రాన్ని కేదర్ సెలగంసెట్టి `ఫాల్కన్ క్రియేషన్స్` బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఇంతకీ ఈయన ఎవరు? ఉన్నట్టుండి కొత్త పేరు తెరపైకొచ్చిందే అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.అయితే విషయం ఏమిటంటే స్టార్ హీరో అల్లు అర్జున్ కు కేదర్ మంచి స్నేహితుడు. ఇటీవలే స్టైలిష్ స్టార్ కేదార్ ను కలుసుకున్నారట. ఆ టైం లో సినిమా చేయాలనే కోరికను బయటపెట్టిన కేదార్...దానికి విజయ్ తో సినిమా చేయమని చెప్పాడట మన బన్నీ..