దేశంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ బైటకి వచ్చి డైలాగులు చెప్పే కంగనా రనౌత్ హథ్రాస్ ఘటనపై మౌనం వహించింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారంలో కంగన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఏకంగా మహారాష్ట్ర సర్కారుపైనా విమర్శలు ఎక్కుపెట్టి, జెడ్ కేటగిరీ భద్రతతో ముంబైకి వచ్చి వెళ్లింది కంగన. అలాంటి కంగన.. సాటి మహిళకు జరిగిన అన్యాయంపై ఎందుకు నోరు మెదపలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సహ నటుడు సుశాంత్ మరణంపై అంత ఆవేదన వ్యక్తం చేసిన కంగన.. దళిత కుటుంబానికి ఎందుకు మద్దతుగా మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నాయి దళిత సంఘాలు.