హీరోయిన్ రష్మీక తన అభిమాని చేసిన ఓ పనికి ఫిదా అయిపోయింది. ఓ  యంగ్ ఫ్యాన్ తన కళ్ళకు గంతలు కట్టుకొని రష్మిక బొమ్మను అవలీలగా, అచ్చు గుద్దినట్లు వేసేశాడు. రష్మిక రూపాన్ని మనసులో ముద్రించుకున్న సదరు అభిమాని చూడకుండానే రష్మిక బొమ్మను చక్కగా వేయడం జరిగింది. ఆ వీడియోను రష్మిక తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.అలాగే ఆ బొమ్మ అద్భుతం అంటూ తన స్పందన తెలియజేశారు.