టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ అతి త్వరలో పెళ్ళి చేసుకోబోతుంది. ముంబయ్‌కి చెందిన ఈ వ్యాపారవేత్త గౌతమ్ కిట్చ్లుతో చందమామ ఏడడుగులు వేయబోతోంది. వీళ్ళిద్దరిదీ అరెంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్ అని టాక్. కొన్నాళ్ళుగా కాజల్ పెళ్ళి కబురు వినబడుతూ వుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలలో యాక్ట్ చేస్తానని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తానని అన్నారు. తనకు మద్దతు ఇస్తున్న వాళ్ళు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కాజల్ కి కాబోయే భర్త ముంబైలో ఉంటారు. అతడికి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఉంది. ఈ నేపధ్యంలో కాజల్, గౌతమ్ కిచ్లూ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.