తమిళ్ ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన నటుడు దర్శన్ తో సనంశెట్టి ఏడాది కాలంగా ప్రేమలో ఉందట. చాలా డీప్ గా లవ్ చేసిందట. అయితే ఈమె పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. అతను నిరాకరించాడట. అంతేకాదు అప్పటి నుండీ సనంకు దూరంగా ఉంటున్నాడట దర్శన్. ఇక చాలా హర్ట్ అయ్యిందట సనం శెట్టి. ఇక అంతటితో ఊరుకోకుండా దీంతో ఈమె అతని పై కేసు పెట్టింది. అయినప్పటికీ పోలీసులు దర్శన్ పై యాక్షన్ తీసుకోకుండా వదిలేశారని తెలుస్తుంది. అయినప్పటికీ సనం అస్సలు తగ్గకుండా కోర్టుకెక్కినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలో దర్శిన్ పై చర్యల తీసుకోవాలంటూ కోర్టు వారు ఆదేశాలు జారీ చెయ్యడంతో.. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారట. త్వరలోనే దర్శిన్ ను అరెస్టు చెయ్యబోతున్నారని సమాచారం.