ఆర్ఆర్ఆర్ షూటింగ్ తిరిగి మొదలైంది. లాక్డౌన్తో ఆగిపోయిన ఈ సినిమా చిత్రీకరణ సోమవారమే తిరిగి ప్రారంభమైంది. ఆ విషయాన్ని ఓ వీడియో ద్వారా చెబుతూ, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భీమ్ టీజర్ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఇప్పుడు ‘రామరాజు ఫర్ భీమ్’ ముస్తాబవుతోంది. ఈ నెల 22న ఆ బహుమానాన్ని ఎన్టీఆర్కి ఇవ్వబోతున్నట్టు రామ్చరణ్ ప్రకటించారు.