వివాహం తర్వాత కాజల్  సినిమాలు నటిస్తుందా? అన్న ప్రశ్న ఆమె అభిమానులను కలవర పెడుతోంది.  అయితే తాజాగా దీనిపై స్పందించిన కాజల్.. `గౌతమ్‌తో కొత్త జీవితం ప్రారంభించడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. ఇన్నేళ్లుగా నాపై కురిపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఈ కొత్త ప్రయాణంలో మేమిద్దరం మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం. పెళ్లి తర్వాత కూడా నాకు ఎంతో ఇష్టమైన నటనను కొనసాగిస్తాను. సినిమాలను ఎప్పటికీ మానుకోను. ప్రేక్షకులకు వినోదం అందిస్తాను` అని క్లారిటీ ఇచ్చింది.